ఎటు చూసినా నీ సడి .
ప్రతీ జడి నీ అడుగులనే నే తడబడి ,
నా మదిలో ఒక మధురమయిన అలజడి .
జడివానలా .... ప్రతి రేయి నిద్దుర కొరవడి
నా కన్నుల .
నీ చిలిపి ఊహల ఒరవడిలో
నే తల వాల్చా ... నులివెచ్చని నీ ఒడిలో ...
అది ఒక వెన్నెల నిండిన వలపుగది .
అది జంట హృదయాల మైమరపుల మధుర ఘడియది
ప్రతీ క్షణం నీ సాంగత్యం .
కోరుతోంది నా మది అనునిత్యం .
మచ్చలేని జాబిలిలా
అచ్చం నీ రూపమే అచ్చు గుద్దినట్లున్నది నాఎదలోగిలిలో ......
నవ మల్లికా కుసుమాల గుచ్చం
విచ్చుకొన్నట్లున్నది నా చిన్ని మదితోటలో ..
కటిక చీకటిలో కూడా నీ రూపం మిణుగురులా
మిణుక్కుమంటూంటే ...........
నీ తలపుల పలకరింతలే నాలో వలపుల కలవరింతలై
వేణుగానమాలకించినట్లున్నది
ఏమరపాటులో నేనుంటే ఏదో మత్తును చిలకరించి
నీ ఊహల సయ్యాటలో అమాంతం నను దోచేసి
నీ వలపుల దారులకై అజ్ఞాతంగా నడిపిస్తూ
నా మనసు శృతి లయ నీవై
ప్రణయరాగాలు పల్లవింపచేస్తున్నావు
నిరీక్షించలేకున్నా నిమిషమాత్రమూ నీకై
ఆలశ్యం దేనికి ప్రియతమా !
ఆశలతీరం చేరడానికి .
రెక్కలు తొడిగి రాలేవా ... నీ నెచ్చెలి దరి చేరడానికి .
సాలిపల్లి మంగామణి @ శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి