చిరు కోకిలమ్మ, చిగురు మావికొమ్మ, సిరిమల్లె పూరెమ్మా,
పరవశాన ఆహ్వానం పలికే నవ్య శకానికి ఈ "ఉగాది"
మధుకలశం మనకోసం తేవాలని,
కువ కువలతొ కోయిలమ్మా, కిలకిలరావాలతో పక్షు లు
చిరుగాలి పరదాలతో, రసరాగాలతో రా రమ్మని
నవ్య పరిమళాలు మన జీవితాన వెదజల్లాలని
ఉదయించే ప్రతిదినం నవ ఉషస్సులతో నిండాలని,
వేసే ప్రతి అడుగు ప్రగతికి పసిడి బాట కావాలని
ప్రతి మనసు సంతసాలతో పరవసించి ఆనందోత్సాహాలతో ఉండాలనీ,
విశ్వమానవాళి చిరునగవుతో జగతిన వెలుగులు నిండాలని,
కోటి ఆశల తీరం నుండి విజయఢంఖా మ్రోగిస్తూ వచ్చింది ఉగాది మన లోగిళ్ళలోకి
విజయాలను కాంక్షిస్తూ ఆహ్వానిద్దాం మన ముంగిళ్ళలోనికి.
హితులకు, స్నేహితులకు, బ్లాగర్లకు అందరికీ
విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ
"విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు"
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండివిజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిమీకు, మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిథాంక్స్ అండి . మీకు కూడా విజయనామసంవత్సర యుగాది శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిమీకు ఉగాది శుభాకాంక్షలు.మీ కవిత కూడా చాల బావుంది
రిప్లయితొలగించండిఈ పండూరు కాకినాడ దగ్గరవున్నదేనా? ఎందుకంటె మా చిన్నతనంలో లో మేము అక్కడికి చాలాసార్లు వెళ్ళాము. మా నాన్నగారు పిక్నిక్ లా తీసుకొని వెళ్ళేవారు తిమ్మాపురం వెళ్ళేదారిలో కదా! చాల బావుంటుంది. తాటిబద్ద వంతెన దాటి వెళ్ళే వాళ్లం. చాల మధురమైన రోజులవి
అవునండి
తొలగించండివిశ్వమానవాళి చిరునగవుతో జగతిన వెలుగులు నిండాలని...
రిప్లయితొలగించండికుమార్ గారూ మీ కోరిక నేరవేరాలనీ.. మీకు మీ బందువులకు, మిత్రులకు శ్రేయోభిలాషులకు విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
మీకు కూడా విజయ ఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి