శ్రీశ్రీ నాటిన అభ్యుదయ సాహితీ వనంలో ..
నే గడ్డి పూవునయినను చాలు .
ఆ రేడు నడిచిన దారిలో......
ఇసుక రేణువునయినను చాలు .
ఆ అభీకుని కలం విదిల్చిన సిరా బొట్టు నయిననూ చాలు .
ఆ మహనీయుని కలాన జారిన కవనంలో .......
నేనొక అక్షరమయిననూ చాలు .
ఆ దార్శనికుని కవితా కడలిలో చిన్ని అలనయినా చాలు .
భాదిత జనాల బాసట నిలువగ,
పీడిత జనాలకూపిరులూదగ ,
కవి తలపెట్టిన మహాయజ్ఞం కొనసాగించుటకై ,
నే ఉడత సాయమందిస్తా ...
సమ సమాజ స్థాపనలో ,నా చిరు కవితాబాణం సంధిస్తా ....
ఇదే నేను వినమ్ర పూర్వకంగా శ్రీశ్రీ గారికి ఇచ్చే కవితా నివాళి .
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
(కళావేదిక కల్చరల్ &చారిటబుల్ ట్రస్ట్ )