పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

17, జూన్ 2013, సోమవారం

మహా కవి శ్రీ శ్రీ 30వ వర్ధంతి - కవిత ల పోటీలుమహా కవి శ్రీ శ్రీ 30వ వర్ధంతి పురస్కరించుకొని 
యువ సాహితీ స్రవంతి, సీతమ్మధార, విశాఖపట్టణం వారు 
నిర్వహించిన కవితల పోటీలో
యువత దిశానిర్దేశం కవితకు  
బహుమతి పొందిన సందర్భముగా తీసిన చిత్రం
1, మే 2013, బుధవారం

శ్రీ శ్రీ జయంతి - కవిత ల పోటీలు
శ్రీ శ్రీ 103వ జయంత్యుత్సవాలు పురస్కరించుకొని 
విశాఖ జిల్లాలో  జరిగిన కవితల పోటీలో 
ప్రధమ బహుమతి పొందిన సందర్భంగా తీసిన చాయా చిత్రం
19, ఏప్రిల్ 2013, శుక్రవారం

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

 శ్రీ రామ నవమి శుభాకాంక్షలుజయ జయ రామ జానకి రామ, 
కోదండ రామ, అయోధ్య రామ
అమ్మ సీతమ్మతో శ్రీరామ చంద్ర స్వామి 
కమనీయ కళ్యాణమే, శ్రీ రామ నవమి
వసుధైక కుటుంబంలో పెళ్ళిసందడి, 
సీతారాముల లోకకల్యాణ వైభోగం.
పసిడి పీటై పులకించె పుడమితల్లి
పచ్చని పందిరాయె ఆ నీలి గగనమ్ము
కల్యాణము తిలకించి పునీత మాయెను ప్రతి జీవి జననం
ప్రతినోట శ్రీ రామ మననం పరమ పావనమాయె జనం
తాటాకు పందిళ్ళు, విసనకర్రలు, వింజామరలు, 
వడపప్పు, పానకాలు వీక్షకులకు
మల్లె పూజడ మా అమ్మ సీతమ్మకు, 
శ్వేత పద్మం మధుపర్కం మా రామయ్యకు
చింతాకు పతకం మా అమ్మకు, 
మా తండ్రి రామయ్యకు రామమాడ, పచ్చల హారం తోడ
కమనీయముగ జరిగేను కల్యాణం జనసంద్రమాయె భద్రాచలము
మది నిండుగ, వీనులవిందుగ, మిన్నంటెను 
సీతారాముల లోకకల్యాణ వైభోగం. 


 శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

11, ఏప్రిల్ 2013, గురువారం

ఉగాది శుభాకాంక్షలు

చిరు కోకిలమ్మ, చిగురు మావికొమ్మ, సిరిమల్లె పూరెమ్మా,
పరవశాన ఆహ్వానం పలికే నవ్య శకానికి ఈ "ఉగాది"
మధుకలశం మనకోసం తేవాలని,
కువ కువలతొ కోయిలమ్మా, కిలకిలరావాలతో పక్షు లు
చిరుగాలి పరదాలతో, రసరాగాలతో రా రమ్మని
నవ్య పరిమళాలు మన జీవితాన వెదజల్లాలని
ఉదయించే ప్రతిదినం నవ ఉషస్సులతో నిండాలని,
వేసే ప్రతి అడుగు ప్రగతికి పసిడి బాట కావాలని
ప్రతి మనసు సంతసాలతో పరవసించి ఆనందోత్సాహాలతో ఉండాలనీ,
విశ్వమానవాళి చిరునగవుతో జగతిన వెలుగులు నిండాలని,
కోటి ఆశల తీరం నుండి విజయఢంఖా మ్రోగిస్తూ వచ్చింది ఉగాది మన లోగిళ్ళలోకి
విజయాలను కాంక్షిస్తూ ఆహ్వానిద్దాం మన ముంగిళ్ళలోనికి.
హితులకు, స్నేహితులకు, బ్లాగర్లకు అందరికీ
విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ
"విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు"