నా కన్నులు నీ కన్నులకై కవితను రాసాయి . నీకు చేరలేదా !
నా మనసు తన ముంగిట ముత్యాల ముగ్గు వేసింది . నువ్వొస్తావని . నీకగుపడలేదా !
నా అధరాలు నిరతం నీ స్మరణమే . నీ చెవికి తాకలేదా !
నా నీలి ముంగురులు గోల గోల చేస్తున్నాయి . తము సవరించగ నువ్వు లేవని . మరిచావా నువ్వు
నువ్వు లేని నేను. నెలరేడు కానరాని పౌర్ణమి.
నీ నవ్వు లేని తావుల్లో నిశిరాతిరి అంధకారం .
నీ తోడు లేని నా గమ్యం . ఎండమావికై పరుగులిడిన వైనం .
నీ జత లేని నా ప్రణయ సీమ. మోడు వారిన బీడు కాదా !
అందులకే చెబ్తున్నా ! ఆరాధనతో, ఆవేదనతో ....
నేనెక్కడ నేనెక్కడ "? నీవు లేని నా ఉనికి నాకే ప్రశ్నార్దకమయి పరిణమించె .
నీవు లేని నేను పూవు లేని తావిని . పదం పడని కవిత్వమని .
నీవు లేని నా జీవితం మాధుర్యం మరచిపోయిన కాటిన్య విషం .
ఏడేడు జన్మలైనా నీతోటిదే నా జీవితం .
నీ తోటిదే నా సంతోషం . కష్టాలే రాని , కన్నీటి వరదల్లోనే చిక్కుకు పోనీ ,
నా ప్రాణాలను హరియించగా ఆ కాల యముడే నన్ను తరిమినా ..
నా శ్వాస ఆగిపోదు . నీ చేయి నా చేతిలో ఉన్నంత వరకు .
సప్తసంద్రాల ఆవల నీవున్నా .. నే సప్తపదులు నడిచిన నీకై నే నిరీక్షిస్తూ నే ఉంటా ..
సాలి పల్లి మంగా మణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి