నేడు రహదారుల ప్రయాణాలు సాక్షాత్తూ యమలోకపు ద్వారానికి దారులు
నేటి ఆధునిక వాహనాల శరవేగాలు, మనను కభళించే మృత్యుపాగాలు. . అడుగడుగునా ప్రమాదాలు
నేటి జనజీవన యానంలో అది షరామామూలు. .
ఎక్కడ చూసినా రక్తమోడ్చు రహదారులె
శోకసంద్రాన నిండిన నిండు జీవితాలె. .గడపదాటి బయటకు వెళ్లిన బాటసారి
మరల తిరిగి వస్తాడని, బ్రతికి బట్ట కడతాడని నమ్మకమేది ఈనాడు !
నిదానమే ప్రధానమని వాహనాలఫై లిఖించేస్తే
నిజానికి ఈ నినాదాన్ని పాటిస్తారెందరు ?
మత్తుల్లో తూలుతూ తోలతారు వాహనాల చోదకులు
నిస్తంత్రిని చేతపట్టి నిదురోతూ నడుపుతారు . .
శిరస్త్రాణం త్యజియించి వేగాన్ని హెచ్చించి దూసుకుపోతుంటారు కొందరు
నియమాలను పెడచెవిన పెట్టి కారుల్లో షికార్లు చేస్తుంటారు మరికొందరు. .
ఈ నిర్లక్ష్యపు పోకడలు, భాద్యత రాహిత్యాలకూ
నిర్దయగా బలయ్యేది, అనాథగా మిగిలేది,
అభాగ్యులుగా మారేది, గుండె పగిలి ఏడ్చేదీ
అన్యం పుణ్యం ఎరుగని నీ అమాయకపు కుటుంబమే
అని మరచిపోకు నీవు. .
నియమాలను మీరి పోకు నీవు. .
కొని వెళ్ళకు ప్రమాదాల తావులకు. . . .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి