సంబరాలు అంబరాన్ని తాకేలా !
ఆకాశమే హద్దు సప్త వర్ణాలు మెరిసేటి ఈ వేళ !
సరిహద్దులే మరచి ఆడిపాడాలి ప్రతీ మనసు మైమరచేలా !
ఉవ్వెత్తున ఎగిసిపడే ఆ సంద్రపు అలలా !
నేరవేరాలి ఈ వేళ రంగురంగుల కల !
విరిసిన ముద్దు రోజా రేకులా !
కురిసిన హరివిల్లులో వర్ణాలు సిరిజల్లులా !
చిరుగాలి పరదాల ఊగిసలాడే మనసే ఊగాలి ఊయలలా !
ప్రతి స్వరం పరవశించి పాడాలి ఎల కోయిలలా !
మనసు పూల తోటలో ఆనంద కుసుమాలు విరబూయాలా !
వెల్లి విరియాలి ప్రతి ఎద లోగిలిలో ఆనంద హేల !
అని ఆకాంక్షిస్తూ ........
మీ
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి