మనిషి ఆశాజీవి అన్నారు కదా ...
కానీ నా మనస్సు మాత్రం దురాశా జీవి ...
ఎందుకంటే నా గుండె కొంచెం వేగం ఎక్కువ .(ఇది నిజం )
మరి అప్పుడు దాని ఆశలక్కూడా తొందరేక్కువే కదా !
నా ఈ గుప్పెడంత గుండెలో ముత్యమంత ఆశ
నా చిన్ని హృదయంలో చిగురించిన చిలిపి ఆశ
అరవిరిసిన నా మది తోటలో మధు ధరహాసం విరబూయాలని ఆశ
సాయం సంధ్యా సమయంలో భానునితో దోబూచులాడాలని ఆశ
జడివాన విరిజల్లులో హరివిల్లుపై నాట్యమాడాలని ఆశ
పురి విప్పిన వయారాల మయూరానికి సరి జోడుగా నర్తించాలని ఆశ
నీలి మేఘమాలికపై ఊయలలూగాలని ఆశ
చిరుగాలితో చేరి అణువణువున విహంగమై విహరించాలని ఆశ
నిండుపున్నమిలో, వెండి వెన్నెలలో పారిజాత పానుపై పవళించాలని ఆశ
పంచెవన్నెల చిలుకల్లే ఎగిరిపోవాలని ఆశ
మానస సరోవరాన చేరి రాయంచల సరసన జలకాలాడాలని ఆశ
చుక్కల పల్లకిలో విహరించాలని ఆశ
లెక్కలేని తారల నడుమన చేరి తళుక్కు మనాలని ఆశ
తలచిన మరు క్షణమే
ఈ భువిని వీగి, నీలిమేఘముల కేగి, హాయి హాయిగా సాగి,
జాగు సేయక చంద్రబింబమును చుంబించాలని ఆశ
ఆశ. . . . .చిన్ని చిన్ని ఆశ. . . . .చిగురించిన చిలిపి ఆశ
ముత్యమంత ఆశ ... ప్రతి మదిని మురిపించు ఆశ
ఆశాజీవులారా ... ఆశను ఆశ పడేందుకు ఆశ తీరా ఆశించండి .
ఆశిస్తారనే ఆశతో మీ
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
SRIMAANI
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి