తుమ్మెదా ! ఓ చిన్ని తుమ్మెదా !
ఓ సారి ఇటు చూడు చెబుతాను నా వ్యధ .
తీయ తీయని మధువు గ్రోలుతుంటావు
హాయి హాయిగ నీవు విహరిస్తూ ఉంటావు
ముచ్చటగా పూలతో ఊసులాడుతావు
చల్లని గ్గాలుల్లో ఊయల్లూగుతావు
రయ్యి రయ్యని జోరుగా ఎగిరిపోతుంటావు
నా వ్యధను చెబుతాను ఒకసారి ఆగవే ...
నా కధకు బదులిచ్చి ఆనాక సాగవే ...
అనురాగమందించు ఆశలే లేవే !
ఆనందమనిపించు ఘడియేది లేదే !
కన్నీట ఓదార్చు చేతులే లేవే !
కష్టాల కడతేర్చు కలలైనా రావే !
మరుజన్మ వుంటే నీలాగ పుడతాను
జన్మ జన్మలకైనా మనిషి కాలేను .
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి