ప్రియతమా ... ప్రియతమా
నీవే నా ప్రేమకి చిరునామా ...
నా తలపుల వనములో
విరబూసిన పారిజాతమా ..
నా జీవన బృందావనిలో
వినిపించిన వేణుగానమా ..
నా గుండె గొంతుకలో పలికిన మృదు సరిగమా
నా మనసుని శృతి చేసిన వీణానాదమా
నా మదిలో మెదిలే మధుర భావమా
నా కన్నుల కదిలిన పసిడి స్వప్నమా
నా ఊహల ఒదిగిన నా ప్రాణమా
మమతను పంచిన మధురానురాగమా
ఇల దిగి వచ్చిన వెన్నెల చంద్రమా
నా కనుపాపల కదలాడే చిరు ప్రతిబింబమా ..
నా మనసుని గురి చూసిన మదనుని బాణమా
నిరతం నా అధరం నీ మననం
ప్రతీ క్షణం నా హృదయం నీ స్మరణం
నీ ఊహలు నా చెంతనుండగ దరి చేరదు ఏ మరణం
నీకై వేచిన క్షణాలు వేయి యుగాలై నను వేదిస్తుంటే
వలపులదారుల్లో నీకై వెతుకుతున్నా
వలచిన వరుడా నీకై వేచి ఉన్నా ...
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి