షికార్లు చేస్తున్న మానవ వరాహాలు !
బ్రష్ఠు పట్టిన మానవ జాతిలో తుప్పుపట్టిన మనసులున్న రాక్షసరాయిళ్ళు
తిరుగాడుచున్న నేటి అత్యాధునిక గంజాయివనంలో ,
నిర్మలమగు తులసి జీవించుట ఎంత కష్టమో ,
కరుడు కట్టిన పైశాచిక సమాజంలో ,
కర్పూరమంటి మనసున్న మహామనీషి మనుగడ కూడా మరణప్రాయమే !
రాక్షసమూకతో రాజీ పడగలమేమో !
బేతాళునితో తలపడగలమేమో !
సముద్ర మధ్యమున చేరి తపమాచరించగలమేమో !
పశు పక్షాదులతో కూడా సంభాషించగలమేమో !
హిమాలయాలనే ఢీకొనగలమేమో !
కానీ.........?
ఈ మానవ జాతిని మాత్రం ఇసుమంతైనా మార్చగలేము ;
కానీ....... ప్రయత్నిద్దాం , ప్రయత్నిస్తూనే వుందాం ;
కలచివేసే వ్యవస్థనే కల్పతరువుగా మార్చేందుకు ,
మనం కలలుగన్న నవ్య వ్యవస్థ నిర్మించేందుకు........
సాలిపల్లి మంగామణి @ శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి