'ఆదిశక్తీ ' అవనిపై వెలిగే ''అఖండ జ్యోతీ ''
ఏ కవి వర్ణించగలడు నీ స్త్రీ జాతి కీర్తి
ముత్తెపు సిరుల మృదు దరహాసం ముదితా .. నీ సొంతం.
మంచు తుంపరల చల్లదనం నీ మది సాంతం .
నీ ఆదరణతో ఆ ధరణి ని తలపించావు
నీ ఔదార్యంతో ఈ అవనికి ఆదర్శం నిలిచావు
మమత మానవత నిర్వచనం నీవై
అనురాగం ఆప్యాయత చిరునామావై
అనంత సృష్టికి ప్రతిరూపం నీవై
జగతిని వెలిగించే దీపం నీవై
ఓ జననివై , తనయవై , సహోదరి నీవై
సహధర్మచారిణివై ,నీ కర్తవ్య పాలనలో
కృతకృత్యురాలవై ,
అన్నింటా నీ జాతి ముందడుగేస్తున్నా ..
కన్నీట కరుగుతున్న కధలెన్నెన్నో ..
చీకట్లో మ్రగ్గుతున్న వ్యధలెన్నెన్నో .
అర్ధరాత్రి అతివ ఒంటరిగా నడిస్తే అదే అదే స్వాతంత్ర్యం
అన్నారే జాతి పిత .
నేడు పట్టపగలు పడతికి రక్షణ ఏదీ ఈ కర్కశ లోకంలో
రాకాసి మూకలు జగతి నిండగా ఉండగా ,
ఇంతి బ్రతుకు ఇక దండగా ? కానే కాదు కదా !
రాణి రుద్రమదేవి ,ఝాన్సీ ,ఒక ఇందిరా ప్రియదర్శిని
ధీర వనితలు వెలసిన' స్త్రీ ' జాతిని
వంచించకు వనితను వంటింటి కుందేలని .
'స్త్రీ ' గౌరవించబడిన కాడే
ముక్కోటి దేవతల జాడ అందులకే ..
గౌరవించు ' స్త్రీ 'జాతిని
ఇనుమడింప చేయండి మహిళాఖ్యాతిని ,
ద్విగుణీకృతం చేయండి వనితా శక్తిని ,
అబల సబల కాదంటూ పెంపొందించండి
అతివలో ధైర్యం ,స్థైర్యం . సహకరించి , ప్రోత్సహించి
ప్రోద్భలమందించి .
'' తెలుసు కదా నాటి మన భారత సంస్కృతిలో స్త్రీల హిస్టరీ ''
''నేడు చేయొద్దు మహిళ బ్రతుకు ఒక మిస్టరీ ''
అని వేడుకొంటూ ..
మహిలో మహిళా మహోన్నత మూర్తులందరికి
సహస్ర కోటి వందనాలతో మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో
............................
సాలిపల్లి మంగామణి @ శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి