ప్రకృతి పాదానికి పచ్చని పారాణి
మేటి సొగసుల రాణి అరకు అలివేణి ....
జలజల పారే జలపాత సరాగాల
గున్నమావి వంకలోంచి ఆమని రాగాల ....
కొండల్లో ,కోనల్లో సెలయేటి సంతకాల .
ధరణి ధరించిన పసుపు జరీచీరలా .....
అరవిరిసిన వలిసెల సొగసుల .
అలరారే మేటి సొగసుల రాణి , అరకు అలివేణి .
వళ్ళు జల్లుమన పిల్లగాలుల ,
వన్నెల, చిన్నెల వంపుల దారుల
గిరి కన్నియల చిరు ధరహాసాల
మనసు మలిచిన మధుర కవితలా .............
అలరారే మేటి సొగసుల రాణి ,అరకు అలివేణి .
అరుణ కాంతుల తాకి మంచు తుంపరలు మంచిముత్యాల్లా ...
ఎద దోచే పూదోటల పరిమళాల
బంతుల ,చామంతుల తోడ ఇంతుల మంతనాల ,
ఝుమ్మని పాడే తుమ్మెద పాటలా ........
అలరారే మేటి సొగసుల రాణి అరకు అలివేణి .
ఇంతటి సౌందర్యం మా సీమాంధ్రలో ఉన్నందుకు
గర్వంతో ఉప్పొంగిన హృదయంతో ...
సాలిపల్లి మంగామణి @ శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి