సృష్టిలోని బంధాలకే బహు అందం స్నేహం .
జత మనసులు విరబూసిన సౌగంధం స్నేహం .
ఆప్యాయతానురాగాల సిరి గంధం స్నేహం .
మధుర సుమధుర మధురాతి మధుర మకరందం స్నేహం .
జన్మ జన్మాల నిలిచేటి ఆనందం స్నేహం .
వెల కట్టగలేని అమూల్య గ్రంధం స్నేహం .
మొగ్గ విరిసి పుష్పమైన రీతి
మనసు కలిసి స్నేహమౌను ....
ఆ కుసుమం చిగురు కొమ్మన మెరిసినటుల
మన స్నేహం జీవిత చరమాంకం వరకు నిలవాలి ...
ఆ సుమం పలువురికీ పరిమళాలు పంచినటుల
మన స్నేహం అందరికీ ఆదర్శం కావాలి .....
కానీ ,
ఆ పూవు వాడిపోయినా , రూపు మారిపోయినా
మన స్నేహం మాత్రం చిరకాలం చిగురించాలి ......
ఈ స్నేహ సుమం వాడని కుసుమం
అని మరచి పోకు నేస్తమా ......
నను విడిచిపోకు మిత్రమా ....
శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి