జననీ జ్ఞానప్రదాయిని శ్రీవాణీనేడు శ్రీపంచమి సరస్వతీ పూజకోసం నా ఈ చిన్ని కవితాకుసుమం
విద్యున్మాలిని వీణాపాణీ శర్వాణీ
సౌదామినీ శాస్త్రరూపిణీ సువాసినీ
నా మనసునె హారతి చేసేద
గైకొనుమమ్మా కళావాహినీ
అర్చింతును తల్లీ
నిను అక్షరమాలికలతోడ
నిను కొలిచెద దేవీ నిరతం
నిర్మల హృదయమ్ము తోడ
ప్రణమిల్లెద పద్మలోచనీ
నీ పాదాల చెంత కవితాకుసుమాలతో
అనుగ్రహించు సరస్వతీ
నీ సాహిత్యాంబుదిలో నీటి బొట్టై నిలిచేందుకు
ఆశీస్సులందిచవమ్మ వాగ్దేవీ
నా మదిలో నీ ధ్యానమే స్మరించేందుకు
ప్రసరింపుము శారదాంభ
నీ కృపాకరుణా కటాక్ష వీక్షణాలు
నా ఈ చిరు కవితార్చనపై
శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి