తెలతెల్లగ తెల్లారగ ఉలిక్కిపడి లేచింది .
తారల పందిరిలో శయనించిన కన్నెభామ .
ఎందైన, ఎందైనా ,ఎందెందైన నాకు సాటి ఎవరన్నది ?
నాకు దీటు రారన్నది .....
తన సౌందర్య పరవశాన తానె ముగ్దురాలైనది .
పంచాభూతాలపై నాట్యమాడుతానన్నది .....
సింధూరపు భానుడనే నా నుదుటన తిలకం దిద్దెద .
వెండి మబ్బునే నా నడుముకు చీరగ చుట్టెద .
నెలవంకనె అలవోకగ నా మెడలో ఆభరణం చేసేస్తా .....
గంగా ,యమునా , కృష్ణా ,పెన్నా ...........
నదులేవైనా , సెలయేర్లైనా
అన్నీ నా చెలరేగిన కురులే కదా .......
సప్తసంద్రాలన్నా ,లక్షద్వీపాలైనా
కొండలైనా,కోనలైనా ...... కోయిలమ్మ కూతలైనా
అన్నీ , నా అందానికి తీరుగ దిద్దిన తుది మెరుగులు కావా .........
అని చిరునగవును చిలుకరించె పులకరిస్తూ ..........
పడచుమనసు ....
శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి