నా గుండె గొంతుక నే సరిగమ రాగం చేసి,
నా అందెల సవ్వడినే నవశ్రుతి చేసి,
నా గాజుల గలగలనే స్వరముగ చేర్చి,
నే పాడెద నవ్య భవ్య మాధుర్య గీతం ...
నా ఊహలే రంగుగా ,నా ఊపిరే కుంచెగా,
నే గీసెద నా హృదయపు కాన్వాసు మీద
రసరమ్య మనోహర రమణీయ చిత్రం
అలరించే అనుభూతులు అల్లిక చేస్తూ,
అనుభవాల అక్షరాలు ప్రతిబింబిస్తూ,
సమాజాన ప్రజ్వలించు పాపాలను తూర్పారపోస్తూ,
నే రాసెద సుతిమెత్తని తియతీయని చిరుకవితల్లా
శ్రీమణి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి