ఓ చిన్ని హృదయమా ..... !
నా.... చిన్ని హృదయమా ..........
నీకెన్ని ఊహలే ....
ఎన్నెన్ని ఊసులే
ఎంతటి నెరజాణవే
ఎంతెంత మాయలాడివే ...
మైమరపున జాబిలితో విహరిస్తావు
నీలి మబ్బునీడలపై నిదురిస్తావు
ఆకసాన హరివిల్లు పై అలిగి కూర్చుంటావు
తారల నడుమన చేరి తళుకును నేనంటావు
ఆదమరచి నే నిదరోతుంటే మధుర స్వప్నమై యెదురొస్తావు
నా కనులు గప్పి విహంగమై విహరిస్తావు
మందలించి నా మాట వినమంటే బుంగమూతి పెడతావు
నీ కోసం నేనా నా కోసం నీవా అన్నప్పుడు
నిజానికి నువ్వే నను నడిపించేది
నువ్వే నను శాసించేది
గుప్పెడంత నా హృదయమా
నీ చప్పుడు ఆగిన మరు నిమిషం
నా ఉనికే శూన్యం
అందులకే చెబుతున్నా నా మనసా నీకభివందనం
శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి