చిలుకమ్మ అడిగింది చిగురాకుని
చిరునవ్వు వెల ఎంతని.... ?
భ్రమరమ్ము అడిగింది సుమ బాలని
తన నోరూర్చు మధువేదని ... ?
చిరుకోయిల అడిగింది వాసంతాన్ని
తనను కరుణించగ రావా ........అని .
కలువభామ అడిగింది చందమామని
తనను చుంబించు ఘడియేదని ... ?
తరచి తరచి అడిగింది పడతి ప్రకృతిని
తనను జత చేరు వరుడేడని ......?
సహజమే కదా ... వరాన్వేషణలో
పరువంలో ప్రతి ప్రాణికి .......
కలవరమాయే మదిలో ...
శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి