తరువులు తల్లడిల్లె
తమ ఉనికి మాయమౌతుందని
మానవులకు తాముచేసిన
అన్యాయమేమనుచు
మానవాళికి ఆయువిచ్చు
తమ ప్రాణం తీయుదురాయని
నీడనిచ్చు మా జాతిని
నిర్దయగా కూల్చివేయుదురాయని
మీ పాపానికి తారెత్తిన భూతాపం
చల్లార్చిన మాపైనా మీ ప్రతాపం
మిము కబళించే కాలుష్యం కరిగిస్తూ
అలసిన మీకు చల్లని గాలుల సేద తీర్చుతూ
అమృత ఫలాల తో ఆకలి తీర్చుతూ
మా తనువున అణువణువును మానవాళికర్పించే
మా పైనా మీ అమానుషత్వం
జాలిలేని మానవుడా మా జోలికి రావొద్దని ,
మా ప్రాణం తీయొద్దని విలపిస్తూ
వేడుకొనెను విరిగిన కొమ్మల తోడ
అపకారికి ఉపకారం మహాత్వమన్నారే
మీ జాతికి మహోపకారం చేసిన
మా కిదేనా మీ ప్రత్యుపకారము
మము ఉద్దరించగ ఉద్యమించండి
నవ ఆశోకులయి నడుం బిగించండి
పుడమి తల్లి పులకరించగ ప్రకృతిమాత
పరవశించగ కరువు రూపు మాపగా
పర్యావరణం పరిమళించగా
భావితరంలో పచ్చని పసిడి నింపగా
పచ్చని మొక్కని నాటి పెంచుదాం
వృక్షజాతి ఋణం తీర్చుదాం
శ్రీమణి
చిత్రంతో పాటు కవితకుడా ఆకట్టుకుంది
రిప్లయితొలగించండిgood one
రిప్లయితొలగించండి