నేనెవరో చెప్పుకోండి ? |
పచ్చని ప్రకృతి ఒడిలో
పచ్చికపై జాలువారు కిరణం నేను ....
పున్నమి రాతిరిలో మనసును మైమరపించే
వెండి వెలుగు జిలుగును నేను ......
విరిసీ విరియని రోజా రేకున
ఊగిసలాడిన హిమబిందును నేను ......
సంకురాతిరి సందె వెలుగులో
పడతి వాకిట తీర్చిదిద్దిన రంగవల్లిని నేను .......
పురి విప్పిన మయూరానికి వయ్యారాల నాట్యం నేర్పిన
అచ్చర నర్తకి అచ్చంగా నేనే .....................
ఆకాశంలో ఆ సప్త వర్ణాల హరివిల్లు నేనే ......
కొండాకోనల్లో తుళ్లిపడ్తూ ఉరకలు వేసే సెలయేరునూ నేనే ...
అంతెందుకు . ప్రకృతి ప్రతి అందానికి ప్రతిరూపం నిజంగా నేనే ..
విరజాజి నేను, విచ్చిన చామంతి నేను,
ఎగిసే అలను , కురిసే జడిని ,, ప్రకృతి ప్రతి ఆకృతిని నేనే ...
సాక్షాత్తూ ప్రతి పడచు హృదయంలో కదలాడే ఊహను నేను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి