ఎల్లలు దాటిన అనురాగానికి చిరునామా
కల్లలెరుగని అనుబందానికి నిర్వచనం ప్రేమ
ఆకాశంలా హద్దుల్లేనిది
మాట మూగబోయినా ...
మనసు గలగల ఊసులాడే మౌన భాష ప్రేమ .
కనులు లేకపోయినా
ఎద లోపల కదలాడే మధురానుభూతి ప్రేమ .
జత మనసులకూపిరి పోసే
అమృత జలధార ప్రేమ
కటిక చీకటి పైన కూడా వెలుగురేఖలు
కుమ్మరించే నవకాంతి కిరణం ప్రేమ
కనురెప్పలు దారి తెరచి
ఎద లోపలి గుడి తెరచి
తను కోరుకున్న ప్రతిరూపం
పదిలం చేసే అపురూపమైన దర్పణమే ప్రేమ
సమస్త సృష్టి స్థితి లయకు ఆధారం ప్రేమ
ఇరు హృదయాల ఆకర్షణ కాదు ప్రేమ
ఆరాధన ప్రేమ, ప్రేమతో ప్రేమించు, ప్రేమకై జీవించు
జీవితాంతం ప్రేమగా జీవించు
ప్రేమకై ప్రేమతోనే ప్రేమగా ప్రేమించు
నమ్మకం, విశ్వాసమనే మూలస్తంభాలేసి
మూడు ముళ్లు ఏడుఅడుగులు ప్రమాణాల మనువే పరమావధిగా
మనసులు ముడి వేసుకొనే ముచ్చటైన ప్రేమకు పరమావధి
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి