పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

ఎందుకెన్నుకోవాలి నాయకులను ?



ఎందుకెన్నుకోవాలి  నాయకులను ?
ఎందుకు తన్నుకు చావాలి  నాయకులకై 
ఎంతమంది  ప్రజాపరిపాలకులు 
ప్రజలకై  పాలన  చేస్తున్నారిపుడు 
ఎన్నికలొస్తాయని  ఎన్ని''కలలో '' సగటు ప్రజకు 
తమనుద్దరించగ  సమర్ధ నాయకుడొస్తాడని 
''ఎన్నికలలో '' సగటు ప్రజకు 
నిజానికి  ఇది ఎండమావుల తావులకై  పరుగులిడిన  వైనం 
కొందరి ప్రజానాయకులకు  ప్రజలేగా ''ఇంధనం ''
ఎంత  దోచినా తనివి  తీరని '' ప్రజాధనం ''
అదే వారికి ''మూలధనం ''
నేటి కొందరు  అవినీతి రాజకీయ శక్తులు 
అడుగడుగున  కుట్రా కుయుక్తులు 
కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట 
మనుష్యుల  విడదీసి, నోట్లను  ఎర చూపి 
కోట్లాదికోట్ల  ఓట్లను  నోట్ల కట్లతో  కట్టిపడేసి 
కర్తవ్యం  మరచిన  కాఠిన్యమూర్తులు 
నల్లదనం  కరిచిన కక్కుర్తి  రాబంధులు 
''ఎందుకెన్నుకోవాలి  నాయకులను 
ఎందుకు తన్నుకు చావాలి  నాయకులకై ''
ప్రజల వెన్నెముకపై  మోయలేని  పన్నులభారం 
అందలానికెక్కిన  అవసరాల ధరలు 
అరకొర వైద్యాలు, అందరాని విద్యలతో 
అల్లాడుతున్న  ప్రజానీకం పాట్లను 
పట్టించుకోని  పాలకవర్గాలు 
మరి... ''ఎందుకెన్నుకోవాలి  నాయకులను 
ఎందుకు  తన్నుకు  చావాలి  నాయకులకై ''?

                                                                                           శ్రీమణి 

2 కామెంట్‌లు:

  1. ప్రజాస్వామ్యం అన్న వ్యవస్థ ఒకటి పేరుకైనా ఉండాలి కాబట్టి, అంతకన్నా వేరే కారణం ఏమీ లెదు.

    రిప్లయితొలగించండి
  2. నిజమే కానీ ఇప్పటి నుండి అయినా ప్రజలు వ్యవస్థను మార్చడానికి ప్రయత్నించాలి కదా

    రిప్లయితొలగించండి