నీలిమేఘాలు వరుసల్లు ముసురేసినప్పుడు
చిరుగాలి పరదాలు చిరుజల్లులై విరబూసినప్పుడు
విరజాజి ఘుమఘుమలు గుమ్మెత్తినప్పుడు
జాబిలి మాటున నేను నిదరోతున్నప్పుడు
మరుమల్లె మంతనాల మత్తెక్కిస్తున్నప్పుడు
మయూరమై మైమరచి నటియించినప్పుడు
జాబిలి మాటున నేను నిదరోతున్నప్పుడు
మరుమల్లె మంతనాల మత్తెక్కిస్తున్నప్పుడు
మయూరమై మైమరచి నటియించినప్పుడు
కోనేటి వంపుల్లో రాయంచనై విహరించినప్పుడు
పులకించి మేనంతా పూమాలలైనప్పుడు
పూబాలతో చేరి ఊసులాడినప్పుడు ,
నులుసిగ్గుల దొంతరలో దోబూచులాడినప్పుడు
నులుసిగ్గుల దొంతరలో దోబూచులాడినప్పుడు
తూనీగతో చేరి సరాగాల తేలినప్పుడు,
చేరి చెలియల తోడ ఊయలూగుతున్నప్పుడు
చుక్కలు ప్రక్కన చేరి పక్కున నవ్వినప్పుడు,
అప్పుడే ... మొదలయ్యింది.
నా పరువం మరువమై మైమరచి విరిసింది.
నా ప్రాయం పరవశించి విరబూసింది.
అప్పుడే, అప్పుడే నా గుండెలో సప్పుడు మొదలయ్యిది.
అప్పుడే నా తనువంతా వింత ఊహల ఉప్పెన పొంగింది
తన రాక సవ్వడికి,నా గుండె గుడికి, వలపుల గది తెరచుకొంది
అప్పుడే నా మనసున మరు మల్లియ విరిసింది.
అప్పుడే....
తియ, తీయని విరి తేనియ కురిసింది నా హృదయంలో
హాయి,హాయిగా వెన్నియలే కురిపించింది నా ప్రణయంలో ...

సాలిపల్లి మంగామణి@ శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి