అమ్మను అయితే అయ్యాను,గానీ ...
ఏదో సంధిగ్ధంతో సతమతమవుతూనే ఉన్నా ...
నా బిడ్డడు ,రాముని తలపించే ఆదర్శమూర్తిగా అవతరిస్తాడో ..
రక్కసుడల్లె కర్కశుడే జనియిస్తాడో ?
కన్నతల్లికి, జన్మభూమికి ఖ్యాతి పెంచే రత్నమల్లె మెరిసిపోతాడో .. పుడమి తల్లికే కే పెను భారమయ్యే కరుడు గట్టిన పాషాణమల్లే పరిణమిస్తాడో ,
కన్నవారినీ ,కాలరాసే కాల యముడికి ఊపిరోస్తానో ..
కలియుగానికి ఆలవాలమవు అపర రావణున్నే ఇలకు తెస్తానో ,
కీచకుడే పుడతాడో ,సమాజానికి పట్టిన చీడపురుగుల్లో ఒకడికి నేనే తల్లవుతానో ,
ఒక మానవత్వమూర్తినే కని తెగ మురిసిపోతానో ..
ఒక మానవత్వమూర్తినే కని తెగ మురిసిపోతానో ..
మహాత్ముడు కాకున్నాగాని,మంచికి ఊపిరిపోసే మాన్యుడైతే చాలు .
నలుగురితో నారాయణ కాదు . పలువురికోసం ప్రాణాలిచ్చే ,
జన్మభూమికి వన్నె తెచ్చే ,
అనాకారియైనా ఆనందమే ,అహంకారి కాకుంటే సరి .
అనాకారియైనా ఆనందమే ,అహంకారి కాకుంటే సరి .
ఆ యమ్మ కన్నబిడ్డ కనకమనిపించాలి .
కనకనే . కునుకే కరువయి ఓ అమ్మ పడే ఆరాటం .
కనకనే . కునుకే కరువయి ఓ అమ్మ పడే ఆరాటం .
పాపో ,బాబో తెలిపే పరికరాలు పుట్టెడు ఉన్నా , పట్టెడు మెతుకులు పెడతాడని ,
మంచికిమారుగా పుడతాడని ,చెప్పే యంత్రం ఉంటే బావుండుకదా !
చీడ పురుగునుకడుపులోనే కాలరాసి ,
మానవత్వం పరిమళించే మాన్య బిడ్డకు జన్మనిచ్చి ధన్యమవదా ..ప్రతి కన్నతల్లి . (సమాజంలో జరుగుతున్న అరాచకాలకు భయభ్రాంతురాలైన నిండు గర్భిణి ఆవేదన )
.నిజానికి పుట్టినప్పుడు ప్రతీ బిడ్డా పరమ పావనుడే ,ఏ బిడ్డా జన్మతః దుర్మార్గుడు కానేకాదు .
బుద్ధి నెరిగిన నాటి నుండే , వక్రమార్గపు వెతుకులాటలు .,వెర్రితలలు వేస్తున్న అక్కర లేని ఆధునికతల ముసుగుల్లో , వింత వింత పోకడలు , మత్తుల్లోమునిగిపోయి మతిభ్రమించి పరిభ్రమించేరు అభినవ కౌరవుల్లా ..
అందులకే చెబుతున్నా ..
తల్లులార మీ బిడ్డల భవితకు బంగారు తాపడాన్ని మీరే అద్దాలి .
తల్లి తలచిన కాని కార్యము లేదు జగాన తనయుల తీర్చి దిద్దుటలో ..... రేపటి పౌరునిగా మలచుటలో ..
ఉగ్గుపాలు , ముద్దు మురిపాలతో ,పాటు
మానవత్వపు పాలు రంగరించి పెంచి చూస్తే ప్రతీ తల్లి .
పెడత్రోవకెక్కడ తావుంది ?ప్రేగు పంచుకొన్న బంధానికి ?
మన సుసంపన్న సంస్కృతినీ ,సాంప్రదాయ రీతులనీ ,నైతిక విలువల్నీ, అక్షరాభ్యాసంతో పాటూ అవపోసన పట్టిస్తే ,
ఆణిముత్యమల్లే మారడా ... అమ్మా ,నాన్నల కనుల వాకిలిలో
కోరుకొన్న భవితవ్యం రంగవల్లిగా తారసపడదా . ఏ ఆధునికత ప్రభావమైనా ,పెచ్చు మీరిన సాంకేతిక విజ్ఞానమైనా ,తల్లి నేర్పిన మొదటి పాఠపు పరిజ్ఞానం ముందు పటాపంచలయిపోదా . దుష్టలోచన దూరమవదా ..

ఎన్ని యుగాలు మారినా ,ఒక కన్న తల్లి సంకల్పిస్తే ,ప్రతీ బిడ్డ పసిడి తుల్యం .
సమాజ ప్రక్షాళనలో ప్రముఖ పాత్రధారిణి మాతృమూర్తి . నవ సమాజ నిర్మాణంలో క్రియాశీలి ఒక తల్లే .
అందుకే , తల్లి చూపిన సన్మార్గమే రేపటి కల్మష రహిత సమాజానికి వారధి . ప్రతీ తల్లీ సారధే .. రేపటి భావి భారత పసిడి రధానికి . మొక్కై వంగనిది . మానై వంగునా .. అంటూ ఊరక కూచోక
నారులోనే మానవత్వపు నీరుపోసి ,మంచి మార్గం నిర్దేశిస్తే , నిక్కంగా కొంగు బంగారమే ,అమూల్యమైన బహుమానమే,అమృత ఫల నైవేద్యమే
ప్రతీ బిడ్డా .. పరమ పావన భారతావనికి . (అవునంటారా నా మాటలను , కొట్టి పారేస్తారా నీతులని )
సాలిపల్లిమంగామణి @శ్రీమణి
ప్రతీ బిడ్డా .. పరమ పావన భారతావనికి . (అవునంటారా నా మాటలను , కొట్టి పారేస్తారా నీతులని )
సాలిపల్లిమంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి