ఓ చిలకల కొలికీ ! నీ పలుకుల తళుకుల జడికీ
ఉలిక్కిపడనీకే.. నా ఊహల వనమాలీ
ఓ వెన్నెల జాబిల్లీ !నా వలపుల జిలిబిలీ
ఆదమరచమాకే! తలపుల చక్కేరకేళీ
ఓ వన్నెల సిరిమల్లీ!నా చిన్ని ఎదగిల్లి
నీ పరువాలు వెదజల్లీ .. వెళ్ళొద్దే చెలీ
నా హృదయాన్ని,ఒదిలీ
నా ప్రణయాల నెచ్చెలి, నిను తలచి తల్లడిల్లి
నీ ప్రణయపు అల్లిబిల్లి మాలిక అలవోకగా అల్లీ
మళ్ళీ మళ్ళీ నా మనసు.. తుళ్ళే నీ వల్లే
ఎట్టా?వేగేదే చెలీ ......
అను క్షణం నీ తలపుల తల్లడిల్లి
నీలాటి రేవులోనీరూపు మరువలేకున్నా..
వేలాది రాగాలు పాడుకొన్న వైనాలు .మరువలేకున్నా
కొనగోటితో మీటిన నీ నీలి ముంగురులు
ఊసులాడుకున్న ఇరు నయనాల ముచ్చట్లు
పరవశాన పదనిసలై పారాడిన ప్రాయాలు
మన మనసున ఉరికిన నయగారపు హొయలు.. మరువలేకున్నా
చేతిలో చెయ్యేసి నడిచెళ్లిన ఛాయలు
చేసుకొన్న బాసలు, పారేసుకొన్న మనసులు
రెండు తనువులు ,ఒకటే హృదయమై పల్లవించిన క్షణాలు
మరువలేకున్నా ... ఎక్కడున్నావో మరి,
నన్ను చేరరావే నా పరువాల నెచ్చెలీ
నా శ్వాసలోనూ ..
నీ కోసమే చూసా ...
నీ ధ్యాసలోనే ...
నా ఆశ పరిచా ..
నను చేరగా రావేలనే
నువ్వు లేని నేను
మనిషినైతే ... కాను
ఒక నడిచే శిలను
నిజమెరుగని కలను
కలనైనా ,, మరలా నిన్నే కలగంటాను.
ఇలలో ఎక్కడ ఉన్నా.... ఇట్టే కనిబెడతాను
(ప్రేమికకు దూరమైన ఒక ప్రేమికుని వేదన )
సాలిపల్లిమంగామణి@శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి