టన్నుల కొద్దీ సిగరెట్లు కాల్చేసై . జల్సా చెయ్ , .
హద్దులు మరచి,విందులో, కనువిందుగా ,...
మందుతో బహు పసందుగా ...
వెలిగించు రింగురింగులుగా..... పొగ గుప్పించు
ఎలాగూ... రేపటి నీ బ్రతుకు ఆరిపోయే దీపమేగా... వెలుగెక్కువే ..
మసి పట్టిన ఊపిరితిత్తులెలాగూ నీ ఊపిరితీసి నిను మట్టి కలుపుతాయి.
నీ ఆయువు ఆవిరయినా ...
నిండు బ్రతుకు నీవల్లే నిప్పులకొలిమయినా ...

నీ ఇల్లాలి తాళి చేల్లిపోతేనేం ?నీ బిడ్డల తలరాతలు తలక్రిందులయితేనేం?
కన్నవాళ్ళ గుండె బ్రద్దలయితేనేం?
గుప్పుగుప్పు మంటూ ఆ గబ్బును గభ గభా లాగించెయ్,
మత్తులోని గమ్మత్తు ను అమాంతం ఆస్వాధించెయ్ ,
నువ్వు కాల్చేప్రతీ సిగెరెట్టు, ప్రతీక్షణం ,నీలో ప్రతికణాన్నికణకణమని కాలుస్తూ
నీకే ,తెలియకుండానే నీ ఉసురు తీసేందుకు,ముసురు గాసింది.
కాటికి దగ్గర దారి... కాలయముడితో కాలక్షేపం సరాసరి,
నిన్నటి నీ వ్యసనానికి నీ వొళ్ళు, నిన్నునమ్ముకొన్నవాళ్ళ ఆశలకు నీళ్ళొదిలేసేయ్, నీ తనువు చిధ్రమై ,బ్రతుకు నిరర్ధకమై ,నిత్యం మృత్యు కేళీ విలాసంలోఊగిస లాడుతూ
నిన్నటి నీ వ్యసనానికి నీ వొళ్ళు, నిన్నునమ్ముకొన్నవాళ్ళ ఆశలకు నీళ్ళొదిలేసేయ్, నీ తనువు చిధ్రమై ,బ్రతుకు నిరర్ధకమై ,నిత్యం మృత్యు కేళీ విలాసంలోఊగిస లాడుతూ
నీకు నీవే భారమై , నీవారికీ పెనుభారమై ,గమ్మత్తులకెగబడి మత్తుల్లో తూలితే మరమత్తు చెయ్యలేని మరబొమ్మగా మిగిలి తగలబెట్టు నీ వాళ్ళ నిండు భవితను నిర్దాక్షిణ్యంగా ...
గమ్మత్తులు చూడాలనిమత్తుల్లో తూలితే మరమ్మత్తు చేయలేని మరబొమ్మై మిగులుతావు. తస్మాత్ జాగ్రత్త ! ( ధూమపానం-మరణానికి సోపానం ,యమపాశానికిఆహ్వానం )
దయచేసి మత్తుమందులకు బానిసలవ్వద్దని అభ్యర్థిస్తూ... మీ సహోదరి
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
pandoorucheruvugattu.blogspot.in

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి