పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

29, మార్చి 2017, బుధవారం

మధు మాసపల్లకినెక్కి ...



ఏ  మధుర రాగాలు ఆలపిస్తుందో 
ఏ మకరంధ కలశాలు గుమ్మరిస్తుందో 
ఏ అంబరాల సంబరాల  మోసుకువస్తుందో 
ఏ సంతసాల సంతకాలు చేయవచ్చిందో 
ఆ ఆనంద డోలికల ఓలలాడిస్తుందో 
ఏ మలయమారుతాల మైమరపిస్తుందో 
వచ్చింది నవవధువై 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల 
మత్తకోకిల  రాగంలా 
మధురోహల పరిమళంలా 
మావిచిగురు సోయగంలా 
మధుమాస సరాగంలా  
మైమరపుల పరాగంలా 
మైవచ్చింది నవవధువై 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల
పచ్చని మాగాణిలా 
నిత్యకళ్యాణిలా 
చైత్రపు మారాణిలా 
పచ్చని పారాణిలా 
రాణిలా 
మారాణిలా 
విరిసిన పూబోణిలా 
వచ్చింది నవవధువై 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల
కోటి ఆశల తీరాల 
కోరిక నెరవేరేలా 
కొంగుబంగారంలా 
సిరిలిచ్చిగలగలా 
సిరులొచ్చి కళకళా 
విరులొచ్చి కలకలా 
వింధ్యామర వీచికలా 
తుళ్ళింతల కేరింతల 
తొలకరి గిలిగింతల 
ఇంతిలా 
చామంతిలా 
ముద్దపసిడి బంతిలా 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల
కోటి ఆశల తీరేలా 
కోరిక నెరవేరేలా 
కొంగుబంగారంలా
భవిత సింగారంలా 
వచ్చింది నవవధువై 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల
      హేవిళంబిసంవత్సర ఉగాది శుభాకాంక్షలతో .... 
                                                         సాలిపల్లి మంగామణి@ శ్రీమణి 
 
 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి