పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

24, మార్చి 2017, శుక్రవారం

పూవు లేని తావి


సంధ్య వాలిపోయే 
సూరీడింటికి ఎల్లిపోయే 
గువ్వలు గూటికి చేరిపోయే 
నీ అలికిడయినా  లేదాయె
నాలో  అలజడేదో మొదలాయె 
ఎటు చూసినా .....  నీ అడుగుల సడి .
ప్రతీ జడిలో  నీవేనని తడబడి ,
ఘడిఘడికీ  మకరందపుమధు జడితో  
నీ తలపులు చొరబడి ,
నిద్దుర  కొరవడి
ఆ  ఊహల  ఒరవడిలో
నులివెచ్చని నీ ఒడిలో ...
తలవాల్చిన నా మది  
అది  తనువును విడివడి
విహంగమాయే వినీలగగనానికెగబడి,
అరనిమిషమయినా
నువు లేక నేను
పూవు లేని తావిని 
నీ జత లేని నేను 
సిరా లేని పెన్ను 
నువ్వెంట లేని గమనం
అది ఎండమావి పయనం
నీతో నడచిన సప్తపదుల సాక్షి
నిమిషమయినా ...
నిను చూడక నేనుండలేను,
సవరించిన నా కురుల సాక్షి
నీ సాంగత్యమే  వేయిపున్నముల సాటి. 
                                                           
                                                  సాలిపల్లి మంగామణి@శ్రీమణి
                                                        pandoorucheruvugattu.blogspot.in
                             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి