పారిజాత పరిమళాల ఆ ప్రభాతవేళ
కులుకుపూల,పలుకుతేనెలూరేవేళ
విరులు ,వింధ్యామరలై
మరులు మరువంపు సరులై ప్రభవించే వేళ
కోయిల కువకువలే వేకువ రాగాలై
నీలిమేఘాల దొంతరపై మది సోలిపోయేటి వేళ.
పొగమంచు పరదాల పచ్చిక మురిసే వేళ
తొలిపొద్దును వెలుగురేడు ముద్దులాడే వేళ
ఆవేళలో ...ఆవేళలో మొదలాయె
వేవేల కదలికలు,
కలలో,కన్నుల్లో వెలిసిన కమ్మని కావ్యాలో
తలపులో,మైమరపులో
వలపులో,వెచ్చని నిట్టూర్పులో
మురిపాలో,తొలకరి రసరాగాలో
ఊరించే కలలో ,ఊహల కెరటాలో
హరివింటిసరాలో,విరివింటి శరాలో
కలకంఠి గుండెల్లో కమ్మని కధనాలో
నులివెచ్చని తలపులు ఎద తలుపులు
తలపులు కావవి . వలపుల మైమరపులు
అన్నులమిన్నకుఅరమోడ్పుకన్నులు
అమ్మో !ఆ ఊసులు ముసిరే మురిపాలు,
వినువీధుల పైనే ఊరేగే కలలూ ...
మానసచోరుని,మధుగోపాలుని
సద్దులుసేయక నిద్దురలోనే చేరే దారులు,
మురళీ లోలుని,మదిలో మలిచే
మనమోహన మదనుని ఎదలో కొలిచే
ఎన్నో కలలను కనులకు పూసే వెన్నెల దారులు.
సాలిపల్లి మంగామణి@ శ్రీమణి
pandoorucheruvugattu.blogspot.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి