పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

20, మార్చి 2017, సోమవారం

అంతర్జాతీయపిచ్చుకలదినోత్సవంసందర్భంగా ...


కాకమ్మ,పిచ్చుకమ్మ కథ వినని వారున్నారా ..!
పిచుకమ్మే మన కిష్టమయిన కథానాయిక మనపిట్టకధల్లో ...
పిచ్చుకగూళ్ళను చూస్తూ అమ్మ చెప్పే కమ్మని కథలు వింటూ పెరిగాం... 
పిచుకమ్మ లేని కమ్మని బాల్యం  ఊహించగలమా ... 
చిట్టిపొట్టి పిచుక మట్టికలవబోతుందంటే తట్టుకోగలమా ... 
మనకు మచ్చికయిన పిచ్చుక మచ్చుకుకూడా కనబడదంట 
బంగారు పిచ్చుక  పిట్ట కధలకే పరిమితమంట  
అంతరించబోతుందట అందాల పిచుక,
కిచకిచలింక వినబడవంట ... బుల్లిపిచ్చుకకు నూకలు చెల్లిపోయేనంట,
అచ్ఛిక బుచ్చిక మాటలు కావివి,
మన శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చిన పచ్చినిజాలు 
అమ్మో!మన చిన్ననాటి  నేస్తాన్ని మరచిపోవాలంటే 
నాకయితే గుండె కలుక్కుమంటుంది. 
దారుణమేంటంటే 
మారణకాండకు మనమే కారణమంట 
 మన విచ్చలవిడి వికిరణాల విషప్రయోగ ధాటికి 
నిలవలేక ,ప్రకృతిప్రకోపానికి  తట్టుకోలేక
భానుని తాపానికి,పెరిగినభూతాపానికి 
తాళలేక,తలదాచుకునే వీలులేక ,
గ్రుక్కెడు నీళ్లు దొరక్క,తిండి గింజలు లేక 
డొక్కలెండి,రెక్కలుడిగి నేలకొరుగుతున్నాయట. 
మరుగవబోతున్నమరో జాతిని బ్రతికించుకొందాం ,,, 
మన తప్పిదాలకు  మనవంతు  పరిహారం చేద్దాం...
మన ఇంటిముంగిట పక్షులకుఆహారాన్నీ,నీటినీ అందుబాటులో ఉంచుదాం
 అన్యంపుణ్యం ఎరుగని అతిచిన్నపక్షిజాతిని ఆడుకొందాం. 
(నేను 5 సంవత్సరాలనుండి పిచ్చుకలకు ధాన్యం నీళ్లు అందిస్తున్నాను. 
మా ఫ్లాట్ ముందు ధాన్యపు గుత్తులు కడుతుంటాను,చాలా పక్షులు వచ్చి కడుపునిండా తిని వెళ్తుంటాయి.. నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది.)

                                                                                          సాలిపల్లిమంగా మణి @@శ్రీమణి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి