ఓటమి అంటూ ఉస్సూరంటే విజేత కాగలవా కలలోనైనా ...
అమావాస్య అంధకారాన్ని అధిగమించక .. పున్నమి వెన్నెల వెల్లి విరి సేనా ..
చేదునూ చవి చూస్తేనే కదా .. మధురపు రుచి పదింతలై తోచేది
దూరం అంటూ ఆగి కూచుంటే , తీరం చేరే దారేది.
కష్టనష్టాలు దాటిన నాడే కదా , అంతు లేని సౌఖ్యపు హాయి
కణకణ మండే నిప్పుల్లోనే పచ్చని పసిడి నిగ్గు తేలేది .
విధి విషమంటూ .. దూషిస్తూ కూచుంటే అదృష్టానికి దరి చేరేదేనాడు
అలుపెరుగక శ్రమియిస్తే .. సాధించలేనిదేముంది . ఈ లోకాన
ప్రతీ క్షణాన్ని పదిలంగా వినియోగిస్తూ .. ఇంకేముంది చేయాల్సిందని
కాలాన్నే .. నిలదీశావో ! నిను మించిన ధీమంతుడు ఉంటాడా ఉర్వీ తలంపై .
చేసిన పనిలో దైవాన్ని కాంచావంటే , నీ కనుసన్నల్లో విజయపు సోపానం .
(నా మాటలతో ఏకీభవిస్తారా .. )
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి