రెండు కన్నులు చాలకున్నవి నిండు పండుగ వేడుకైన మీ కళ్యాణ వైభోగ శుభ ఘడియ వీక్షించ . ,వేడుకొందును ప్రభూ !వేయి కన్నులు ఒకసారి మాకొసగవయ్యా . రాజసమునొలికించు నీ దివ్య రూపం కాంచినంతనే మాకు కలతలేవి ?కలికి చిలకల కొలికి సిరి మహా లక్ష్మి మాయమ్మ సీతమ్మ పెళ్లి కూతురుగా తల వాల్చి నీ పాద మంజీరనాదాలనే గాంచి తన్మయమున తలమునకలయిపోయి ముగ్ధమొహన సౌందర్యాన్ని నీ కనుసన్నల కానుకిచ్చి ,అహో ఏమి భాగ్యమ్ము మాది . భద్రచలేషుని పరిణయమ్మును గాంచ . నీలి మేఘాల కూర్చి నీ మేని వర్ణంగా మార్చేనేమో ఆజానుబాహుడా అరవింద నేత్రుడా అరక్షణము మాత్రమైనా కను రెప్పవాల్చమే . నీ సమ్మోహన రూపాన్ని కాన్చకుండా ....
ఆ ధరియిత్రి పుత్రికకు ,పుణ్య చారిత్రికకు ,మేలిమి బంగారు ఛాయ మేనంతా చామంతి పూమాల సొగసులేపాటి . నా యమ్మ వాల్జడ నాగినికి సాటి , మా యమ్మ నేత్రాలు ఆల్చిప్పల పాటి . వెన్నెలను తురుముకొచ్చి నాయమ్మ కన్నుల్లో కుమ్మరించినట్టు . ఆ సల్లని చూపులో కొట్టొచ్చినట్టు , ఆ ముగ్ధ మోహనాంగి మోమును గాంచి మా మేను పులకించ . నీవెట్లు మురిసితివో నీ నెచ్చెలిని చేరి . ఆ గగనమే ఆకుపచ్చని పందిళ్ళు వేయగా .. ముల్లోకములు భువి చేరి నీ పెళ్లి ఘడియకై పసిడి అక్షతలు చేతబూని , భూదేవి తల్లి పెళ్లి పీటముగా మారి ప్రకృతంతాపరవశించీపోయి చిలక పచ్చతోరణమ్ములు గా చేరి ,ఆనందరాగాల సన్నాయి మేళాల కోయిలలు కూయ. ఏమి సంభరమయ్య శ్రీ రామచంద్రయ్య . సృష్టి ముంగిట సుమ బాణాలు మెరియ . వడ పప్పు ,పానకాల
నాలుకలు నవనీత చవుల తో నాట్యమాడ , కల్యాణ రామయ్య ,అన్నుల మిన్న మా జానకమ్మ దోసిళ్ళ ముత్యాల తలబ్రాలు బోయ , చందనపు కాంతులే వెల్లివిరియ , ఆ శ్వేత వస్త్రాల శోభిల్లు నవ జంట . కన్నులకు పంటగా కానుకే కాదా !నిత్య నీరాజనాలతో అలరారు సీతా మనోభి రామా !మా కొరకు మీరుండ ... మాకేల వెతలు . మీ రాజ్యమున మేము చల్లగుండ .
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి