అందమంటే మనిషిదా..!
అందమైన మనసుదా...!
పట్టరాని అందమంటే
పైపైన సౌందర్యమా...
అపురూప లావణ్యమంటే
రూపురేఖలకే పరిమితమా...
అంగాల అమరిక కాదు గదా అందం
అంతరంగ సోయగమే
అత్యద్భుత సౌందర్యం
అచ్చంగా అందమంటే
స్వచ్ఛమైన మనసేగా...
ఆత్మశుద్ధితోనే సాధ్యమగును
అద్వితీయ ఆనందం
అంతఃసౌందర్యమే...దానికి
అనువైన సాధనం
కాలగమనంలో కరిగిపోయేది
బాహ్యసౌందర్యమైతే
అక్షయమైన ఆనందం
మనసునంటిన సౌశీల్యమనే మకరందం
పైపైన మెరుగులకే
ఆకర్షితమౌతాము గానీ
హృదయాంతరాళాలను
తరచి చూడమెందుకో...?
బాహ్యమైన సొగసులకై
బంధీలమే గానీ బహుకాలం
నిలుచునా...పలుచనైన ఆబంధం
నిజమైన అంతఃసౌందర్యం గాంచిన
అనుబంధం విడివడునా.. ఏనాడైనా...
చక్కదనం అంటే చక్కని ఆలోచనావిధానం
ఒసపరితనమంటే
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం
ఎనలేని అందమైనా మనలేదు
మేలిమంటి మనసు ముందు
అందులకే నేస్తం
అందమైనమాట
అందమైన ఆలోచన
అందమైన నడత
ఆదుకునే గుణముంటే
ఆద్యంతం ఆ అందం మన సొంతం
అసలు సిసలు ఆనందమే
ఆసాంతం.
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
మనసును కదిలించిన కవిత
రిప్లయితొలగించండిAbsolutely correct
రిప్లయితొలగించండి🌺ధన్యవాదాలు మీకు🌺
రిప్లయితొలగించండి