నీటి చుక్కా ...
నీకభివందనం🙏
అమృతధారను
తెచ్చి అరచేత పోసినా..
అరక్షణము మనగలమా,
జలధార లేక!
సిరులెన్ని దొరలినా..
నీరు పొరలని
నేల రిత్తమే కాదా...
భావి నీటి వెతల
భరతవాక్యమ్ము పాడగా...
వృధా సేయక ఊరక
ప్రాణాధారమ్మును,
వానచినుకును
ఒద్దిగ్గాఒడిసిపట్టి,
అడుగంటి పోతున్న
జలవనరునదిమిపట్టి
భద్రమ్ము సేయరా
ప్రతి నీటి చుక్కా ... ...
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
Wow xlent message u r great sri mani garu
రిప్లయితొలగించండి✍✍✍👌👌👌👏👏👏👏💧🙏🏻