దుష్ట సంహారణార్ధమో , ఆధునికదుస్సంస్కృతీ
నిర్మూలనార్ధమో , దుర్మార్గరాజకీయా లకు భరతవాక్యం పలుకుతుందో
లోకకళ్యాణార్ధమే కార్యోన్ముఖి యై ఏతెంచిందో ?
ఏ విజయ శంఖం పూరించనుందో
బడుగులకే అడుగులకు మడుగులెత్తే కొత్త ఒరవడి మోసుకొస్తుందో
పల్లె గువ్వల నవ్వుల సవ్వడి పట్టణాలకూ గుభాళిస్తుందో,
రైతన్నల గుండెల్లో రతనాల వాన కురిపిస్తుందో,
వరుణుడనే శరణు గోరి అమృతధారను అవనికి తెస్తుందో
చదువులమ్మని వెంట రమ్మని కమ్మని భవితవ్యం యువతకు తెస్తుందో ,
ఆహ్వానిద్దాం ఈ దుర్మిఖిని
ఊరేగిద్దాం ఆశల హరివిల్లుపై
మారాం చేద్దాం మంచినే మనకిమ్మని
దూరం చేయమని అభ్యర్దిద్దాం ,
నిన్నటి ఘోరాలు,మొన్నటి నేరాలు ,ఆధునికత పేర పెచ్చుమీరిపోతున్న
మన వికృత చేష్ట లపై ప్రకృతి ప్రకోపా లనూ,
మానవ తప్పిదాలను మన్నించమంటూ ...
ఏదేమైనా మనవంతు మనంగా మానవత్వంతో,మంచిమార్గంలో,
మనీషిగా కాకపోయినా మనసున్న మామూలు మనిషిగా మారతామని
సమాజానికి సన్నిహితమై,కల్మష రహిత సమాజానికి
ఉడతసాయమందించుటకై సుముఖంగా
ఉన్నాననంటూ దుర్మిఖితో విన్నవించుకొందాం .
మన భవితకు మనమే పసిడి పానుపు పరచుకొందాం
దుర్ముఖీ నామ శుభాకాంక్షలతో ....... సాలిపల్లిమంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి