ఏమివ్వగలను చిట్టితల్లీ ?
ఏమివ్వగలను చిట్టితల్లీ ?
నీ చిరునవ్వుల సరితూగే బహుమానమే
ఈ మహిపై అగుపడలేదే నాకు .
ఆకాశం నుండి ఆ తారకనే కోసుకువచ్చి నీకు
కానుక నిద్దామంటే
తారసపడగానే!
నీ తళుకుకు అలిగి ముడుచుకోదా ఆ తారక .
పుత్తడి అంతా బోసి,పుట్టెడు నగలనుజేసి,
నీకలంకరిద్దామంటే !
నా పుత్తడిబొమ్మవి నీవు,ఆ పుత్తడి వెలవెల బోదా ?
రతనాలు,మణులు,మరకత మాణిక్యాలు.
నీ ముంగిట మురెపంగా రాశిగ పోద్దామంటే...
నా సుగుణాల రాశి ముందు మసకబారిపోవా!మరి .
అందుకే .......
ఏమివ్వగలను చిట్టితల్లీ?
ఆనందాశ్రువుల చెమ్మగిల్లిన ఈ అమ్మ
కనురెప్ప చాటున దాచుకొన్న ఆశను,
కలలుగన్న కమ్మని ఆశయాన్ని,అనురాగం రంగరించి
ఆశీస్సులివ్వగలను. శతాయుష్మాన్ భవ,అనే
పసిడి పచ్చని అక్షతలు రాల్చి,నీ శిరస్సున .
పుట్టినింటికి పుట్టెడు ఖ్యాతినీ ,
జన్మభూమికి గంపెడు ఘనఖ్యాతినీ,
ఇనుమడింప జేసి,మము పులకరింప జేసి నీ ప్రతిభతో
ఆకాశమే ... హద్దుగా వెలుగొందు నా కోటి ముద్దుల తల్లి
ననుగన్న నా చిట్టితల్లీ !
( నా చిన్నారికి....... ప్రేమతో, పరీక్షల కానుకగా ... )
సాలిపల్లి మంగామణి @ శ్రీమణి
http://pandoorucheruvugattu.blogspot.in/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి