.
అమ్మ తన ప్రేమామృతాన్ని అనురాగంతో రంగరించి ఉగ్గు పడితే ,
అది మన నరనరాల పొర్లి పొర్లి తేట తెలుగులా మారి మన నాలుక పై మధురామృతమై జాలు వారె కాబోలు . అందులకేనేమో మన తెలుగు పలుకు తీయ తీయనితేనెలు చిలుకు . పంచదార గుళికంటి చెరకు .
మన హృదయ స్పందనే అమ్మైనప్పుడు ,
మన తెలుగు భాషను ప్రస్థుతించగ తెలుగు బిడ్డకు పదములున్నవా . తెలుగు భాషకు వెలుగులద్దగ ప్రతీ తెలుగు బిడ్డ కదలి రాగా !
కన్నతల్లి తెలుగు భాషను కళ్ళ నీరే పెట్టనీకు . మాతృ భాషను మరుగునెట్టి పరుగులెత్తకు పరాయి పంచకు, వంచించకు వరాలతల్లిని ,అరువు తేకు ఎరువు భాషని , అన్ని భాషలు అవసరానికి ,
అమ్మ బాష మన ఆత్మ బలానికి ,
తెలుగన్న దమ్ములారా తెలుగు ని వెలిగించండి
దయ చేసి తెలుగును కాపాడండి .
తెలుగు బిడ్డలైనందుకు తెలుగు ను బ్రతికించండి .
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
అమ్మ తన ప్రేమామృతాన్ని అనురాగంతో రంగరించి ఉగ్గు పడితే ,
అది మన నరనరాల పొర్లి పొర్లి తేట తెలుగులా మారి మన నాలుక పై మధురామృతమై జాలు వారె కాబోలు . అందులకేనేమో మన తెలుగు పలుకు తీయ తీయనితేనెలు చిలుకు . పంచదార గుళికంటి చెరకు .
అమ్మా !అనే కమ్మని భావన .మాతృత్వపు మాధుర్యం చవి చూపిస్తే , మన మాతృభాష గొప్పదనం మన ఉనికికే మణిమయహారం .
బ్రహ్మ మనకిచ్చిన నజరానా అమ్మైతే ,
అమ్మ మనకందించిన తరగని నిధి ,కమ్మని తెలుగు భాష సన్నిధి .
మాతృమూర్తిని పొగడడానికి ఎన్ని పదములు కూర్చగలవు .మన హృదయ స్పందనే అమ్మైనప్పుడు ,
మన తెలుగు భాషను ప్రస్థుతించగ తెలుగు బిడ్డకు పదములున్నవా . తెలుగు భాషకు వెలుగులద్దగ ప్రతీ తెలుగు బిడ్డ కదలి రాగా !
కన్నతల్లి తెలుగు భాషను కళ్ళ నీరే పెట్టనీకు . మాతృ భాషను మరుగునెట్టి పరుగులెత్తకు పరాయి పంచకు, వంచించకు వరాలతల్లిని ,అరువు తేకు ఎరువు భాషని , అన్ని భాషలు అవసరానికి ,
అమ్మ బాష మన ఆత్మ బలానికి ,
తెలుగన్న దమ్ములారా తెలుగు ని వెలిగించండి
దయ చేసి తెలుగును కాపాడండి .
తెలుగు బిడ్డలైనందుకు తెలుగు ను బ్రతికించండి .
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి