నేను అమ్మని ,
ఒకప్పుడుఆ బ్రహ్మ చేసిన బొమ్మని ;
తదుపరి అమ్మ గర్భంలో ఒక కమ్మని కదిలికను ,
ఆనక నాన్న కన్నుల్లో ఆనందపు చెమ్మని ,
మొన్న నా వలపుల రేడుకి ముద్దు గుమ్మని ,
నిన్న బిడ్డకి జన్మనిచ్చిన అమ్మను ,
అక్షరాలు దిద్దించి మంచి చెడులు నేర్పించిన , మొదటి పంతులమ్మను ,
కొత్త పదవి తో , అయ్యాను అత్తమ్మను ,
ఆనక పిట్ట కధలు చెప్పే బామ్మను .
చివరి మజిలీ చేరే నాటికి అమ్మను కాను, ఎవరికీ ఏమీ కాని వ్యర్ధమైన జన్మను
బిడ్డలకడ్డొచ్చిన అవిటి బొమ్మను ,
అంగట్లో విసిరేసిన దూళి , దుమ్మును
(కన్న తల్లిని నడి రోడ్ల మీద వదిలెళ్లిన నయ వంచకులను కన్న తల్లి కన్నీటి రోదన )
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి