అందంగా అమిరిన నా హృదయపు పొదరింట్లో , నీ రూపం నవ మన్మధ బాణంలా
నులివెచ్చని వెన్నెట్లో నిదురించిన నా కనుపాపల పై నీ అధారాల చిరు సంతకం తేనియ జలపాతంలా
ఉలిక్కిపడి చూస్తే నీ రాకను చెప్పకనే చెప్పిన నీ అడుగుల చప్పుడు. సరికొత్త సరాగంలా ... ,
నిను తాకిన చిరు గాలి చందనం నేనున్నతావులను నందనవనముగా మార్చి సౌగంధపు వీచికలా
నా మేనంతా వింత హాయిలో విహరిస్తుంటే , నిశీదిలోను నీ తలపు నిండు చంద్రుని కాంతి రేఖలా ..
స్వప్నములోను నీ ధ్యాశే తనువంతా అమృత ధారలా ,
నేనెలాగ నిలువ గలను నిశ్చేతన నేను నీ వలపులజడిలో ,
నా లో ప్రేమకు ప్రతిరూపం నీవై
అనురాగానికి ఆలంభన వై ,
నా హృది వీణ పలికిన సరిగమవై
నా తనువును తన్మయ పరచిన తంత్రం నీవై
నాలో అణువణువున నిండి ఉన్న నిన్ను
తలచి మురిసిపోడానికి , ఒక రోజంటూ ఎందుకు ప్రతీ రోజు ప్రేమికులరోజేగా ...
ప్రేమించే మనసులకు ప్రతీ క్షణం ఆనంద వీక్షణమేగా .....
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి