టన్నుల కొద్దీ సిగరెట్లు కాల్చేసై జల్సా చెయ్ , .
నీ ఇల్లాలి తాళి చేల్లిపోతేనేం . నీ బిడ్డల తలరాతలు తలక్రిందులు అయితేనేం ,
తల్లి తండ్రి గుండె బ్రద్దలయితేనేం .
, గుప్పుగుప్పు మంటూ ఆ గబ్బును గభ గభా లాగించెయ్ .
మత్తులోని గమ్మత్తు ను అమాంతం ఆస్వాధించెయ్ ,
నువ్వు కాల్చేసిగెరెట్టు . ప్రతీ క్షణం ,నీలో ప్రతి కణాన్ని కణకణ మని దహించేస్తే
నీకే ,తెలియకుండానే నీ ఉసురు తీసేందుకు , ముసురు కాచుకొన్నట్టే ,
కాటికి దగ్గర దారిని వెతుక్కొంటూ నిండు బ్రతుకు కుకొరివి పెట్టుకొంటూ ,ఆయువు ఆవిరి కావిస్తూ
నిన్నటి నీ వ్యసనానికి నీ వొళ్ళు , నిన్ను నమ్ముకొన్న వాళ్ళ ఆశలు , చిధ్రమై ,
బ్రతుకు భారమై , నిత్యం మృత్యు కేళీ విలాసంలో ఊగిస లాడుతూ
నీకు నీవే భారమై , నీ వారికీ , పెనుభారమై ,గమ్మత్తులకెగబడి మత్తుల్లో తూలితే మరమత్తు చెయ్యలేని మరబొమ్మగా మిగిలి తగలబెట్టు నీ వాళ్ళ నిండు భవితను నిర్దాక్షిణ్యంగా ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి