కడలి కన్నీరు ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసి,
తన ప్రకోపాన్ని ఈ మానవాళికి చవి చూపిస్తూనే ఉంది .
చవి చూపిస్తేనే ఉక్కు కట్టడాలే ఊగిసలాడిపోతే , మరి తన సహనాన్ని శోధించాలని చూస్తే ,
కన్నెర్ర చేసిన ఆ సంద్రపు క్రోధాన్ని చూడాలన్నా ,నిలిచి ఉంటుందా ఈ జీవ రాశి ఆసాంతం . మిగిలి ఉంటుందా మచ్చుకయినా మన సామ్రాజ్యం .
కన్నెర్ర చేసిన ఆ సంద్రపు క్రోధాన్ని చూడాలన్నా ,నిలిచి ఉంటుందా ఈ జీవ రాశి ఆసాంతం . మిగిలి ఉంటుందా మచ్చుకయినా మన సామ్రాజ్యం .
నేటి చిందర వందర ఉరుకుల పరుగుల జీవన గమనంలో ,మనిషి చేసే కాలుష్య కాండను , మన్నించలేక , మనపైనే విరుచుకుపడుతుందిలా .. కన్నెర్ర చేసిన కడలి క్రోద సంతకాన్ని , కినుక వహిస్తే తుడిచి పెట్టుకు పోదా !భూమి పైన పరమాణు జీవి సైతం . మితిమీరిన సాంకేతికత్వం ప్రకృతి సహజత్వాన్నే కాల రాసేస్తుంటే , విషవాయువు కసితీరా పచ్చదనాన్ని కాటేస్తుంటే ,కళకళలాడాలంటే సంద్రానికైనా,భూమాత కైనా ఆస్కారమెక్కడ? మానవ జాతికి అంతిమ సంస్కారం తప్ప .
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి