నా ఆశల ఊపిరి నీవే
నా ఊహల రూపం నీవే
నా జీవిత గమ్యం నీవే
నా కలలకు సాక్షివి నీవే
నా తలపుల రేడువి నీవే
నా వలపుల చెలికాడివి నీవే
నిన్ను చూసిన చాలు
నా కళ్ళ లొగిళ్ళ పూదోట నిలిచేను
అవధుల్లేని ఆనందం
ఉవ్వెత్తున అలల లా లేచేను
వద్దన్నా వినకుండా మేను పులకరించేను
అలవోకగ నా ఆశలు తెరచాపలా పయనించేను
చెంత చేరి కోకిలమ్మ కబురులేవొ చెప్పేను
వింత వింత ఊహలతో మది ఉక్కిరిబిక్కిరి అయ్యేను
మాట రాక నా అధరాలు మూగబోయి చూసేను
నిను చూసిన క్షణం
నా ఊహలలోని నీకోసం
"నిను చూసిన క్షణం" కవిత చాల బాగుంది. సిరిసంపదలు సమకూర్చే దీపావళి మీ ఇంట ఆనందవెలుగులు నింపాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండి