నేనెంత? నేనెంత ?
ఈ అనంత మానవాళి
జీవితాలు మార్చుటకై ! కష్టాలు కడతేర్చుటకై !
నేనెంత? నేనెంత ?
అనుకోకుండా...
నేనే అంతా.. నేనే అంతా.. అనుకో !
ఒక జీవితాన్నైనా మార్చి
కష్టాలకు అండవై
ఆ మండుటెండ గొడుగువై
కటిక చీకటి చిరుదీపపు వెలుగువై
ప్రకాశాన్ని అందించు
చిగురుటాకు చిగురించినా, పండుటాకు నేల రాలినా
ప్రకృతి ధర్మమే కదా ! మరి,
ఎందుకు ఈ ఆందోళన, ఈ ఆక్రందన
ప్రతి జీవి పుట్టిన నాటినుండి చిగురిస్తూ,
ఫలితాలను అందిస్తూ చివరకు తనువు చాలిస్తూ
మట్టిలో కలిసిపోతుంది కదా
మరి ఎందుకు? ఇంత ఆరాటం?
ఇది ఆపలేని, ఆగని, జీవనపోరాటం అని
తెలుసుకదా....
ఉన్నంత వరకు ఏమి చేయగలమో
ఎంత చేయగలమో , ఎలా చేయగలమో
ఎందుకు చేస్తున్నామో అని అలోచిస్తూ
ఒక్క జీవితానికైనా దారి చూపుదాం
అవనిపై అదృష్టవశాత్తూ లభించిన
మన , ఈ జన్మకు సార్ధకత చేకూర్చుదాం
be possitive ! but not lonely ! power of powerty is only with labour !
రిప్లయితొలగించండిit is not lonely sir, every body has to think that నేనె అంతా
రిప్లయితొలగించండిok madam ! srama + ikyatha = manava vikasam
రిప్లయితొలగించండినిజమే కదా
రిప్లయితొలగించండిమమ గారు,నేనెంత,నేనెంత.......... నేనే అంతా అనే మీ భావన simply superb.
రిప్లయితొలగించండిespecially last 6 lines నాకు చాలా బాగా నచ్చాయండి!
ఈ విధంగా ప్రతి ఒక్కరు తను ఎంత చేయగలరో అంత చేయగలిగితే ఈ భారతావని ఎంతో బాగుంటుందని నా ఉద్దేశ్యం.