గాంధీ జయంతి వేడుకలు నిన్న దేశమంతా జాతి యవత్తూ ఎంతో ఘనంగా గాంధేయవాదం స్పూర్తితో జరుపుకొన్నాం. నిజానికి నిన్న జరిగిన వేడుకలు నిజంగా గాంధీ గారికి ఘనమైన నివాళేనా......
ఎందరు అధికారులు, రాజకీయనాయకులు, గుత్తేదారులు, పెట్టుబడిదారులు, ఆఖరుకు ప్రజలు బాపూజీ స్పూర్తిగా పనిచేస్తున్నారు (దేశ సేవ సంగతి వదిలెయ్యండి) నిజాయితీ, నిబద్దత, నిష్కళంకమైన క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఎంతమంది గడుపుతున్నారు? ఇంతవరకు ఎంతమంది అదికార్లుగాని, రాజకీయనాయకులు గాని పెట్టుబడిదారులు గాని వారి వారి ఆస్తులు వెల్లడించారు? ఎంతమంది గుత్తేదార్లు నిజాయితీతో కట్టడాలు నిర్మిస్తున్నారు? ఎంతమంధి అధికారులు నిజాయితీతో వారి వారి విధులు నిర్వర్తిస్తున్నారు? నిజంగా అలనాటి బ్రిటీషు ప్రభుత్వమే నిజాయితీతో నిబద్దతతో పనిచేసిందనటానికి నాటి ప్రాజక్టులె నేటికి నిదర్శనాలు (కాదంటారా) మరి మనకు స్వాతంత్ర్యం తేవడానికి అంకిత భావంతో కృషి సల్పిన మహానుభావులకు ఇదేనా మనమిచ్చే ఘనమైన నివాళి.. నిజానికి నేడు దర్యాప్తు చేస్తున్న సి.బి.ఐ. కు స్వయం ప్రతిపత్తి ఇచ్చినట్లైతే దెశంలో ఉన్న అవినీతి అధికారులను గాని, రాజకీయనాయకులను గాని అక్రమాలకు పాల్పడే వ్యక్తులను గాని ఉంచడానికి మన జైళ్ళు సరిపోతాయా? విచారించడానికి ఉన్న న్యాయస్థానాలు సరిపోతాయా?
మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ది చెందిననాడే దేశానికి స్వాతంత్ర్యం అన్నారు గాంధీజి. నేటికీ మన దేశంలొ మహిళా బిల్లు సాధికారతకు నోచుకోలేదే? మరి ఎక్కడ స్వాతంత్ర్యం?
గనులను దోచుకోవడంలోనా, 2జి కుంభకోణాల్లో మునిగిపోవడంలోనా, నల్లధనాన్ని దాచుకోవడంలోనా, గాంధేయవాదంతో అవినీతి రహిత సమాజ స్థాపనకు కృషి చేస్తున్న వారిని అణగద్రొక్కటంలోనా?
ఎక్కడ స్వాతంత్ర్యం? నిజానికి విదేశీయులకు ఉన్న స్ఫూర్తి కూడా మనలో లేదే మరి, ఎవరిని మోసం చేయడానికి ఈ నివాళుల కార్యక్రమాలు?
మీకు నిజంగా నిజాయితీ అనేదే ఉంటే నిన్న మీరు గాంధీ గారి చిత్రపటానికో, విగ్రహానికో నమస్కరించినపుడు గాని, దండ వేసే సమయంలో గాని (అవినీతిపరులైతే) మీరు ఆత్మన్యూనతా భావానికి గురైతే (ఎందుకంటె మనలొ ఎక్కడొ, ఏ మూలో, కొంచెం మానవత్వం ఉంటుంది కనుక) ఇకనైనా మీకు చేతనైన, చేయగలిగిన, దేశ సేవ నిజాయితీతో, నిష్కళంకమైన మనసుతో, చిత్తసుద్ధితో చేసిననాడు అవినీతిరహిత సమాజాన్ని నెలకొల్పడంలో కృషి సల్పిననాడు నాటి స్వాతంత్ర్య సమరయోధులకు, బాపూజికి అదే మనమిచ్చే ఘనమైన నివాళి
ఓ మహాత్మా, ఓ మహర్షీ.... .మన్నించు.. నీవిచ్చిన స్వాతంత్ర్య ఫలాలను అనుభవించలేకపోతున్నందుకు
good idiology . palletoollanu preminche vaaru prakruthini preminche vaaru prasanthamgaa alochistaaru . go a head. best of luck.
రిప్లయితొలగించండిpalla kondala rao
www.janavijayam.blogspot.com