పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

1, అక్టోబర్ 2011, శనివారం

జీవనశైలి (నాటి తరం - నేటితరం) పెద్దల (వృద్దుల) దినొత్సవం సందర్భంగా

నాటి తరం జీవనశైలి ఎంతో అద్భుతమైనది. ఉమ్మడి కుటుంబం,కలసిమెలసి సఖ్యతతో కూడిన జీవనవిధానం. ఇంట్లో ఎమిజరిగినా అందరూ కలసి ఆనందింఛి అనుభవించే జీవనశైలి. నాడు లేని ఈ పెద్దల దినోత్సవాలు. నేడు ఎందుకు చేసుకోవలసి వస్తుందంటారు? (కారణం) నేటితరంలో తల్లి దండ్రులకు దూరంగా జీవనపోరాటం సాగిస్తున్నాం కనుక,  (ఉద్యొగాలు, పిల్లల్ల చదువులు) మన దైనందిన జీవితంలో మనకోసం, మన అభివృద్దికోసం మన తల్లిదండ్రులు పడిన శ్రమ, పంచియిచ్చిన అనురాగం ఆప్యాయత, నిరంతరం మన యొగక్షెమాలు కాంక్షించె ఆనందించే వారు . కాని నేడు మనలో ఎంతమంది  మన తల్లిదండ్రులు   యొగ క్షెమాలు తెలుసుకుంటున్నాం.   మనల్ని మనమే  ప్రశ్నించుకోవాల్సిన అగత్యం (కాదంటారా) 
మనతో పాటె మన తల్లిదండ్రులు వాళ్ళ తలిదండ్రులు కలసి (ఉంటే) ఎంత బాగుంటుంది. వినడానికె ఎంత ఆహ్లాదంగా ఉందంటే నిజంగా అనుభవించే వారు ఇంకెంత అదృష్టవంతులో కదావారికి వారి కుటుంబానికి జోహారులు .

ఇక్కడి వరకూ సరే, కొంతమంధి ఈ భాగ్యానికి నోచుకోని నిర్భాగ్యులు  చాలా మంది ఉన్నారు. ఎందుకంటె మనలొ తగ్గిపోతున్న మానవత్వం, నైతిక విలువలు, లోపిస్తున్న సంబంధ బాంధవ్యాలు, (నేటి నగర జీవన విధానం కూడా కొంత కారణం కావచ్చు) పిల్లల చదువుల కొరకు  (kinder garten)  పెద్దలను వేలివేయ్యడానికి వృద్దశ్రమాలు. వ్యత్యాసం ఎమిటంటె ,సాయంకాలం పిల్లలను ఇంటికి తీసుకు వచ్చెస్తున్నారు. తల్లి దండ్రులను మాత్రం నెలకో, సంవత్సరానికో, ఒకసారి చూడటానికి వెళ్ళాలని ప్రయత్నించేవారెందరో ఉన్నారు . అందుకే నేటి నగరాలలో ఇన్ని వృద్ద ఆశ్రమాలు. ఇవి అవసరం అంటారా?  
మనల్ని ఎలా అయితే మన తలిదండ్రులు చూసుకోన్నారో అదేవిధంగా వారిని మనం చూసుకున్ననాడు మన పిల్లలు దగ్గర మనకు కూడా అదే గౌరవం దక్కుతుంది (అలా అని మనకు అనురాగం ఆప్యాయత లేదని కాదు
ఏది ఏమైనా పెద్దలందరికీ, పిల్లలతో కలసి ఉన్నవారికి, పిల్లలకు దూరంగా ఉంటున్నవారికి అందరికి హృదయపూర్వక  శుభాకాంక్షలు 
ఈ క్రింది వీడియో గమనించగలరు 


1 కామెంట్‌:

  1. ఒక మంచి మరియు అత్యంత అవసరమైన అంశాన్ని స్పృశించారు. మీరన్నట్లు లేదా కోరుకున్నట్లు జరగాలంటే వ్యవస్థలోనే మార్పు రావాలి. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మారితే ఆ కుటుంబానికో లేదా ఆ వ్యక్తి వున్నంత వరకో మంచి వుంటుంది. ఈ నాటి సమజ స్పీడు అర్ధం లేనిది అనడం లో ఏ మాత్రం సందేహపడాల్సిన పనిలేదు. అయితే దీనికి వ్యక్తులను బాధ్యులను చేయడం కరక్టు కాదు. ప్రతి వ్యక్తిలో దాదాపు మానవత్వం మిగిలే వుంటుంది. పెట్టుబడిదారీ సమాజం లో 'పెట్టుబడి ' దాని అత్యంత సహజ కోరిక అయిన లాభాన్ని కోరుకుంటుంది. ఇందుకు గాను సమాజంలో ప్రతిదానిని లాభం తెచ్చే సరుకుగా మార్చడానికి సకల ప్రయత్నాలు చేస్తుంది. ఆప్యాయతలు - అనుబంధాలూ అన్నీ సరుకుల మాయలో పడిపొతాయని మహానుభావుడు కార్ల్ మార్క్స్ ఏనాదో బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినట్లు చెప్పాడు. ఒక భార్య తన భర్త ఎక్కువ సంపాదిస్తే సంబరపడుతుంది. ఒక కొడుకు తన తండ్రి ఎక్కువ బహుమతులు కొనిపెడితే మా నాన్న మంచి నాన్న అంటాడు. ఇలా ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే డబ్బు మాయలో చిక్కుకోక తప్పదు. ఈ మాయదారి వ్యవస్తలో వుంటూ మీరన్న మంచి జరగాలంటే సాధ్యమయ్యేపనే కాదు.గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు రాగూడదంటే సాధ్యం కాదు గదా ? రానున్న రోజులలో ఎవరి ఆధిపత్య ప్రదర్శన కొసం వారు మరింత దిగజారుతారనడం లో సందేహం లేదు. కానీ మనుషులంగా మనం మన అవసరాల కొసం స్రుష్టించిన డబ్బు (సరుకు) మాయలో పడకుండా చేయలేమా ? తప్పకుండా చేయగలం . మీ లాగా మంచిగా ఆలోచించే వాళ్ళంతా ఏకమైతే మీరు కోరుకున్న అందరి ఆనందాన్ని పంచుకునే అందమైన మరో ప్రపంచం వస్తుంది . వృద్దులు వారు కన్న పిల్లలు - పిల్లలు వారిని కన్న తల్లిదండ్రులు అంతెందుకు? సర్వ మానవ సౌభ్రాత్రుత్వం విలసిల్లుతుంది . ఆ రోజు కొసం ఎన్నాల్లైనా పొరాదుదాం !

    రిప్లయితొలగించండి