తెలుగుతల్లి గుండెల్లో పగుళ్ళు పుట్టాయి
పచ్చని తెలుగు పైరులో తెగుళ్లు పుట్టాయి ....
మా తెలుగుతల్లి సరములోని
సుమాలు విడివడిపోయాయి
అన్నదమ్ముల ప్రాంతీయతగాదాలు
అమ్మ పంపకాలకి పాల్పడ్డాయి
కళకళలాడే తెలుగునేల కలిసుండే
కలలు కల్లలైపోయినాయి
తలో దిక్కైన తనపిల్లలతో తల్లడిల్లే తల్లిమనసు
సమైఖ్య గీతంలో పల్లవి పలు దారుల మళ్ళింది
కళ్ళెదుటే కన్నతల్లి
కన్నీటి వెల్లువై ఉప్పొంగింది
సమరం సంబరమయ్యిందని సంరంభం ఒక వైపు
అమరజీవుల త్యాగఫలం విఫలమాయెనని
విషణ వదనాలొకవైపు
ఒక ప్రక్కన మోదంతో ఒక ప్రక్కన ఖేదంతో
అటు వీపు ఇటు కడుపని
మిన్నకుండి చూస్తుంది
ముక్కలైన తెలుగుతల్లి
శ్రీమణి












