నీటి చుక్క ... ...
అమృతధారను తెచ్చి అరచేత పోసినా
అరక్షణము మనగలమా అర్ణమ్ము లేక
సిరులెన్ని ఉన్ననూ జలసిరులు కాననిచో
ఉర్వీతలంబంత రిత్తమే కాదా,
భావి నీటి వెతల భరతవాక్యమ్ము పాడగా
వృధా సేయక ఊరక ప్రాణాధారమ్మును
అడుగంటి పోతున్న అంభువులనదిమిపట్టి
వానచినుకును ఒద్దిగ్గా ఒడిసిపట్టి ,
భద్రమ్ము సేయరా ప్రతి నీటి చుక్కా ... ...
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి