పరవళ్ళు తోక్కేటి మాయమ్మ ఒళ్లో తుళ్ళితుళ్ళి నేను పెరిగాను .
,పచ్చాపచ్చని చేలో పరుగుల్లు తీశాను .
వెచ్చని ఎన్నెల్లో గువ్వల్లే ఎగిరాను ,
పిల్లా గాలులతోటి ఉయ్యాలలూగాను .
చేప పిల్లలతోటి సయ్యాటలాడాను .
చల్లాని గోదారి కంటి పాపన్నేను . " తూర్పు "
పూల బాలలతోటి ఊసులాడేదాన్ని
పూవంటి సుతిమెత్త మనసున్నదాన్ని
గోదారమ్మ కొంగు పట్టి ఆటలాడేదాన్ని
కమ్మ ,కమ్మనీ తెలుగుల కవితలల్లేదాన్ని " తూర్పు "
పాడిపంటల నడుమ ఆడి పాడే దాన్ని ,
అన్నపూర్ణా దేవి అన్నులమిన్నను నేను
ధాన్యసిరి లక్ష్మికి కాలి అందియ నేను .
కమ్మని ప్రేమలో అమ్మని మించిన దాన్ని ,తూర్పు గోదారమ్మ బిడ్డనే నేను .
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
pandoorucheruvugattu.blogspot.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి