మరువగలమా మహాత్మా...
మరులుగొన్న నాయకత్వ గరిమ .
అభివర్ణించగ తరమా !
అత్యద్భుత నీ కర్తవ్య ధీక్షా పటిమ,
పులివెందుల సింహమా..
పుడమిన ఉదయించిన రాజసమా...
నువు తనువు చాలించి అమరుడవైనా...
నువ్వొదిలెల్లిలిన ఆశయాల సాధనలో... చిరంజీవివే సుమా...
నువ్వులేని శూన్యం మము నిలువునా కుదిపేసినా...
నువ్విచ్చిన స్ఫూర్తే, మా ఎడతెగని ధీమా..
మరువగలమా ... మహాత్మా
విడువగలమా ... నీ వాత్సల్యం,ప్రేమ
కధన రంగ సింగంలా
ఎడతెగనీ నీ తెగింపు
మధనపడే బ్రతుకుల్లో
ఆదుకొన్న నీ ఓదార్పు
అడుగడుగున వేళ్ళూనిన
అరాచకానికి నువ్విచ్చిన ముగింపు
అక్కా చెల్లెళ్ళంటూ ...
నీ అనురాగపు పలకరింపు
నేనున్నది మీ కొరకంటూ
పాదయాత్రతో నీ పిలుపు
ధరిత్రి ఉన్నంత వరకు
చెరగని చరిత్ర నీ తలంపు
మా కోసం జనియించి
మాకోసమే జీవించి
మాకోసం పరితపించి
అంతలోనే నిష్క్రమించి
తెలుగు ప్రజల గుండెల్లో
రాజేసినావు ఆరని నిప్పు
ఏడేడు లోకాల నువ్వు ఏడునున్నా గాని
నీ ఆశయాల స్మరణమే మాకు ఊరడింపు
ఇడుపులపాయలో ఇమిడిపోయిన నీ పవిత్ర ఆత్మకు
శాంతి చేకూరాలని ఆ దేవుని అభ్యర్థిస్తూ ...
(రాజన్నజయంతి సందర్భంగా ...వేవేల నీరాజనాలతో నా నివాళి )
సాలిపల్లిమంగామణి@శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి